

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు లిస్టింగ్ రోజే కీలక మైలురాళ్లను అందుకున్నాయి. సోమవారం ఐపీఓ ముగిసిన తర్వాత సెబీ నిబంధనల ప్రకారం గురువారం బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ధర రూ.1,785తో పోలిస్తే 0.84 శాతం ప్రీమియంతో రూ.1,800 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. తొలి రోజే ఇంట్రాడేలో రూ.1,878 గరిష్ఠాన్ని తాకిన షేరు, చివరికి 1.85 శాతం లాభంతో రూ.1,818 వద్ద స్థిరపడింది.
తొలి రోజు ముగిసేసరికి ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.4.5 లక్షల కోట్లకు చేరింది. దీంతో ప్రపంచంలోని అత్యంత విలువైన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఎన్‌ఎస్‌ఈ ఏడో స్థానంలో నిలిచింది. అలాగే భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా 11వ అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. బీఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.1.3 లక్షల కోట్లుగా ఉండగా, దానికి మూడు రెట్లకు పైగా ఎన్‌ఎస్‌ఈ విలువ నమోదైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!