5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ విధిస్తే నగదు వైపు మళ్లనున్న చిన్న వ్యాపారులు

Writer: Nithish 06:17 AM, 5 నవంబర్, 2026
యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ విధిస్తే నగదు వైపు మళ్లనున్న చిన్న వ్యాపారులు

రూ.2,000కు మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధిస్తే చిన్న వ్యాపారులు తిరిగి నగదు చెల్లింపుల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అధ్యయనం వెల్లడించింది. వినియోగదారుల నుంచి రూ.2,000లోపు చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్‌ నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ, వారు సరఫరాదారులకు చేసే చెల్లింపులు రూ.2,000 దాటితే 0.4 శాతం ఛార్జీ భరించాల్సి రావొచ్చని నివేదిక పేర్కొంది. ఈ భారాన్ని వ్యాపారులపైకి బదిలీ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఎండీఆర్‌ అమల్లోకి వస్తే యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించడం తగ్గిస్తామని పెద్ద నగరాల్లో 53 శాతం, చిన్న నగరాల్లో 45 శాతం మంది వ్యాపారులు వెల్లడించినట్లు అధ్యయనం తెలిపింది. ఐఎస్‌బీకి చెందిన సెంటర్‌ ఫర్‌ అనలిటికల్‌ ఫైనాన్స్‌ 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 64 పట్టణాల్లో 722 మంది వీధి వ్యాపారుల అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 67 శాతం మంది యూపీఐ చెల్లింపులు స్వీకరిస్తుండగా, 52 శాతం మందికే ఎండీఆర్‌పై అవగాహన ఉంది.

ఎండీఆర్‌ భారం వినియోగదారులపై పడే అవకాశం

నెలకు రూ.లక్ష వరకు యూపీఐ చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు మాత్రమే ఎండీఆర్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. అయితే తమపై ఎండీఆర్‌ భారం పడితే ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తామని పెద్ద నగరాల్లో 30 శాతం, రెండో శ్రేణి పట్టణాల్లో 14 శాతం, మూడో శ్రేణి పట్టణాల్లో 19 శాతం మంది వ్యాపారులు తెలిపారు. మరికొందరు నగదు చెల్లింపులనే కోరతామని వెల్లడించారు. పెద్ద నగరాల్లో 82 శాతం, రెండో శ్రేణి పట్టణాల్లో 66 శాతం, మూడో శ్రేణి పట్టణాల్లో 64 శాతం మంది వ్యాపారులు ఇప్పటికే యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. డిజిటల్‌ లావాదేవీల నుంచి చిన్న వ్యాపారులు దూరమైతే బ్యాంకు రుణాలు పొందే అవకాశాలపైనా ప్రభావం పడవచ్చని ఐఎస్‌బీ నివేదిక హెచ్చరించింది. అందువల్ల ఎండీఆర్‌ను అమలు చేయడానికి ముందు పరిమిత స్థాయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచించింది. సరఫరాదారులు, వినియోగదారులపై పడే భారం, నగదు లావాదేవీల్లో వచ్చే మార్పులను అధ్యయనం చేసిన తర్వాతే ఛార్జీల భారాన్ని ఎలా పంపిణీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం.. భారత్ వాణిజ్యం, స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం?

అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం.. భారత్ వాణిజ్యం, స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం?

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

ఇల్లు కొనేముందు గ్రీన్‌ రేటింగ్‌ చూడండి..

ఇల్లు కొనేముందు గ్రీన్‌ రేటింగ్‌ చూడండి..

దీపావళికి ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

దీపావళికి ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

స్టాక్‌అల్‌లో అనధికార ట్రేడింగ్‌ కలకలం..

స్టాక్‌అల్‌లో అనధికార ట్రేడింగ్‌ కలకలం..

ట్యాగ్లు
యూపీఐయూపీఐ చెల్లింపులుఎండీఆర్ ఛార్జీలుచిన్న వ్యాపారులుడిజిటల్ చెల్లింపులునగదు లావాదేవీలుఐఎస్‌బీ అధ్యయనంవీధి వ్యాపారులుబ్యాంకు రుణాలుడిజిటల్ ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ
జనరల్

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అగ్నివీర్‌లకు భారీ ఊరట
జనరల్

అగ్నివీర్‌లకు భారీ ఊరట

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు
జనరల్

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌
జనరల్

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌
జనరల్

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు
జనరల్

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు

ట్రంప్‌ ఎన్నికల ఓటమిపై మీమ్స్‌.. జ్ఞానేశ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు
జనరల్

ట్రంప్‌ ఎన్నికల ఓటమిపై మీమ్స్‌.. జ్ఞానేశ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు

దీపావళి బాణసంచా పొగతో ఊపిరితిత్తులకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యం

దీపావళి బాణసంచా పొగతో ఊపిరితిత్తులకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!