

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో నేడు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ములుగు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!