5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

Writer: Nithish 07:56 AM, 5 నవంబర్, 2026
ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘దేశద్రోహి’ అంటూ వ్యాఖ్యానించిన ఆయన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మోదీని నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని చర్చకు వస్తే ఐదు నిమిషాల్లో నిరూపిస్తానని సవాల్‌ విసిరారు. పార్లమెంటులో చర్చకు రావాలని తాను కోరితే, ఎన్డీయే నేతలు సభలో చర్చిద్దామని చెబుతున్నారని, అయితే లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్‌ కట్‌ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మూడేళ్ల గడువు విధించడంపై స్పందిస్తూ, అప్పటికి ఆయన ఆ పదవిలో ఉంటారో లేదోనని ఎద్దేవా చేశారు. తన అంచనా ప్రకారం ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు. బుధవారం పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన ఇన్సాఫ్‌ ర్యాలీలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అదానీ పోర్టులో పట్టుబడిన మాదకద్రవ్యాల వ్యవహారంపై అమిత్‌ షా సమాధానం చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఆ ఘటనపై కేంద్రం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. శాంతిభద్రతల గురించి మాట్లాడే ముందు గ్యాంగ్‌స్టర్లకు ప్రోత్సాహం లభిస్తోందన్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని అన్నారు. మణిపుర్‌లో పరిస్థితులపైనా కేంద్రం దేశానికి వివరణ ఇవ్వాలని కోరారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపైనా రాహుల్‌ విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో ఇచ్చిన హామీని భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఆప్‌ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గతంలో లోక్‌సభలో భగవంత్‌ మాన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఆయన జోకులు వేసేవారని, ఆయన నుంచి మద్యం వాసన వచ్చేదని రాహుల్‌ ఆరోపించారు. మాదకద్రవ్యాలపై పోరాడాలనుకునే ముఖ్యమంత్రి మద్యం మత్తులో ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సచిన్‌ పైలట్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!

అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!

బీజేపీకి మేలు చేసేందుకే ఆప్ రాజకీయాలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి మేలు చేసేందుకే ఆప్ రాజకీయాలు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి.. వైఎస్సార్‌సీపీ డిమాండ్

ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి.. వైఎస్సార్‌సీపీ డిమాండ్

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

రిపబ్లికన్ల కోసం మస్క్‌ భారీగా ఖర్చు

రిపబ్లికన్ల కోసం మస్క్‌ భారీగా ఖర్చు

రామచంద్రపురంలో వైకాపా ఓటమిపై అభ్యర్థి ఆవేదన.. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు

రామచంద్రపురంలో వైకాపా ఓటమిపై అభ్యర్థి ఆవేదన.. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
రాహుల్‌ గాంధీప్రధాని మోదీకేంద్ర ప్రభుత్వంఅమిత్‌ షాట్రంప్‌కాంగ్రెస్‌ఆమ్‌ ఆద్మీ పార్టీభగవంత్‌ మాన్‌పంజాబ్‌ రాజకీయాలుడ్రగ్స్‌ నిర్మూలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు చూడొచ్చంటే?
సినిమాలు

ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు చూడొచ్చంటే?

పోలింగ్ శాతం తగ్గొద్దు.. ఎన్డీఏ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు
రాజకీయాలు

పోలింగ్ శాతం తగ్గొద్దు.. ఎన్డీఏ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాజకీయాలు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

విశ్వక్ సేన్‌కు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?
సినిమాలు

విశ్వక్ సేన్‌కు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..
జనరల్

హైదరాబాద్ మెట్రో టికెటింగ్‌లో సాంకేతిక సమస్యలు..

తొలి సినిమా విడుదల కాకుండానే శ్రీకాంత్ కుమార్తెకు భారీ అవకాశాలు?
గాసిప్స్

తొలి సినిమా విడుదల కాకుండానే శ్రీకాంత్ కుమార్తెకు భారీ అవకాశాలు?

ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన నాని
గాసిప్స్

ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన నాని

కారణం లేకుండానే ట్రోల్ అవుతున్న కీర్తి సురేష్‌?
గాసిప్స్

కారణం లేకుండానే ట్రోల్ అవుతున్న కీర్తి సురేష్‌?

టాలీవుడ్‌ను వదిలి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీలీల
సినిమాలు

టాలీవుడ్‌ను వదిలి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన శ్రీలీల

సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న చిన్న హీరోయిన్?
గాసిప్స్

సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న చిన్న హీరోయిన్?

అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడి వీటో పవర్ అంటే ఏమిటి? దాని అధికారాలు, పరిమితులివే!

సల్మాన్ కొత్త సినిమా ట్రైలర్‌పై భారీ అంచనాలు
గాసిప్స్

సల్మాన్ కొత్త సినిమా ట్రైలర్‌పై భారీ అంచనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!