

శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య రామమందిర ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నియామకాన్ని చేపడుతున్నట్లు ట్రస్ట్ తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు 2026 జూలై 18 సాయంత్రం 4 గంటల వరకు గడువు నిర్ణయించింది.
ఈ పదవికి 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రముఖ సంస్థల్లో కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం ఉండాలి. హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు తప్పనిసరి. సనాతన హిందూ సంప్రదాయాలను పాటించే వారికి, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన సీఈవో ఆలయ పరిపాలన, ట్రస్ట్ నిధుల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, భద్రత, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నియామకానికి రిటైర్డ్ జస్టిస్ ప్రదీప్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేష్ హవాడే సభ్యులుగా ఉన్న ప్రత్యేక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితాను ట్రస్ట్‌కు సిఫారసు చేయనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!