
రాజకీయాలు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో జానీ మాస్టర్ స్పందించారు. యూనియన్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై మాత్రమే చర్చలు జరిగాయని, తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. తాము అందరం సోదరుల్లా కలిసి పనిచేస్తున్నామని, యూనియన్ అభివృద్ధే అందరి లక్ష్యమని పేర్కొన్నారు.
ఇటీవల వచ్చిన వార్తల గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆరా తీశారని జానీ మాస్టర్ తెలిపారు. అనంతరం చిరంజీవి షూటింగ్‌లో శేఖర్ మాస్టర్‌ను కలిసి పాత పాటలు, పాత జ్ఞాపకాల గురించి సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు. అన్ని కొరియోగ్రాఫర్లకు, అన్ని హీరోల నుంచి మంచి సహకారం లభిస్తోందని, యూనియన్‌లో చర్చలు కేవలం పరిపాలనా అంశాలకే పరిమితమని, అందులో శేఖర్ మాస్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!