

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు టీజర్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. టైటిల్ గ్లింప్స్, ‘కంసంనిద’ పాట ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.
టీజర్‌లో రాయలసీమలోని పెనుకొండకు చెందిన కనకరాజు జీవితం, ఓ కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత అనూహ్య మలుపు తిరుగుతుంది. ఒక రహస్యమైన కొరియన్ ఆత్మ అతన్ని ఆవహించడంతో ‘కొరియన్ కనకరాజు’గా మారతాడు. కామెడీ, యాక్షన్, హారర్, ఫాంటసీ అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ తేజ్ తన యాస, లుక్‌తో ఆకట్టుకోగా, సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!