
రాజకీయాలు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆమోదం లభించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో పల్నాడు జిల్లాలో వైద్య విద్య, ఆరోగ్య సేవలకు మరింత ఊతం లభించనుంది.
పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రణాళికలో భాగంగా నిర్మించారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఈ కళాశాల నిర్మాణ పనుల్లో సుమారు 95 శాతం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాల కార్యకలాపాలు ప్రారంభమై తొలి బ్యాచ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ బోధన అందించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!