
రాజకీయాలు

షాబాద్‌లో బాలిక సహా ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్ కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో మృతిచెందిన స్థితిలో కనిపించాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహం పక్కన విషం బాటిల్ లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. దీంతో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన అతని మేనమామ గ్రామంలో జరిగినట్లు సమాచారం. షాబాద్‌లో బాలికతో పాటు ఆరుగురిని హత్య చేసిన కేసులో రాజ్‌కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!