
రాజకీయాలు

‘రణబాలి’ చిత్రానికి సంబంధించిన రష్మిక మందన్న సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ లుక్‌ను ఉద్దేశిస్తూ ఆమె, "వీళ్లేదో భయంకరమైన వర్క్ చేస్తున్నారు.. బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్నా" అంటూ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ సరదాగా స్పందిస్తూ, "క్యూటీ... భయం కాదు, డివైన్!" అని రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ చమత్కార సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, ‘రణబాలి’ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!