

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి సంబంధించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు పార్టీ ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుకు చోటు దక్కలేదు. యూపీలో ఖాళీ కానున్న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. హర్దీప్ సింగ్ పూరీ ప్రస్తుత రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగియనుంది.
బీజేపీ ప్రకటించిన జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్ ఉన్నారు. ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా ఉన్నారు. రాజ్యసభ జాబితాలో ఆయనకు చోటు దక్కకపోవడంతో తదుపరి రాజకీయ పాత్రపై చర్చ జరుగుతున్నప్పటికీ, నవంబర్ 25లోపు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!