

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో 28 ఏళ్ల పరిశోధకురాలు తీవ్ర న్యుమోనియాతో మృతి చెందింది. ఇర్కుట్స్క్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ఆమెకు ప్లేగు వ్యాధి సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగశాలలో జీవ పదార్థంతో పనిచేస్తున్న సమయంలో ఓ టెస్ట్ ట్యూబ్ పగిలినట్లు స్థానిక, అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆమెకు ప్లేగు సోకిందని, ప్రయోగశాలలో జరిగిన ఘటనకు ఆమె మృతికి సంబంధం ఉందని రష్యా ఆరోగ్య అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
పరిశోధకురాలితో సంబంధం ఉన్న దాదాపు 200 మందిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటివరకు పర్యవేక్షణలో ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, నిర్వహించిన పరీక్షల్లోనూ ప్రతికూల ఫలితాలే వచ్చినట్లు అధికారులు తెలిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. పరిశోధకురాలి మృతికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!