
జనరల్

మంగళగిరి-తాడేపల్లి ప్రాంతంలో వరద ముంపు నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వరదల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.68.73 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
రాష్ట్ర విపత్తు నివారణ నిధి (ఎస్‌డీఎంఎఫ్) ద్వారా మొత్తం 37 వరద నివారణ పనులు చేపట్టనున్నారు. ఇందులో మంగళగిరి డివిజన్‌లో 26 పనులకు రూ.33 కోట్లు, తాడేపల్లి డివిజన్‌లో 11 పనులకు రూ.35.73 కోట్లు కేటాయించారు. ఈ పనుల ద్వారా వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వరద ముంపు సమస్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!