

తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల పనితీరుపై పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర సహ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు పలు అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. క్రియాశీల సభ్యత్వం లేని కొందరు కూడా రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో కొనసాగుతున్నారని మధుకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో నిధుల దుర్వినియోగంపై అభయ్ పాటిల్ సమీక్ష నిర్వహించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముగ్గురు మినహా మిగిలిన వారంతా హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మేనేజ్ చేసుకుని పదవులు పొందడం సాధ్యం కాదని, నేతల పర్యటనలను తామే నేరుగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!