

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రెస్‌మీట్‌లో అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న స్పందనతో పాటు సినిమా పనులు, ప్రచార కార్యక్రమాలను మరింత మెరుగ్గా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేసిన తర్వాతే విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రాబోయే రెండు మూడు వారాల్లో మరో రెండు పాటలు, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నాగవంశీ తెలిపారు. గతంలో చర్చకు వచ్చిన అక్టోబర్ 30 తేదీ కూడా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. వెంకటేశ్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సురేశ్‌బాబుతో చర్చించి తుది విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ముందుగానే విడుదల తేదీని ప్రకటించడం తమవైపు జరిగిన తప్పిదమని నాగవంశీ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!