
బిజినెస్

అమెరికా టెక్ దిగ్గజం ఎన్‌విడియా తన కొనుగోళ్ల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ హగ్గింగ్ ఫేస్‌ను 1,293 కోట్ల డాలర్లకు, అంటే సుమారు రూ.1.22 లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఎన్‌విడియా సీఈవో జెన్‌సెన్ హుయాంగ్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించారు. ఓపెన్ మోడల్ డెవలపర్ కమ్యూనిటీకి హగ్గింగ్ ఫేస్ అద్భుతమైన వేదిక అని ఆయన పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు క్లెమెంట్ డిలాంగ్యు, జులియన్ చామాండ్, థామస్ వోల్ఫ్ 2016లో హగ్గింగ్ ఫేస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 180 లక్షలకుపైగా డెవలపర్లు, పరిశోధకులు, క్రియేటర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారని హుయాంగ్ తెలిపారు. మూడు మిలియన్లకుపైగా మోడల్స్, ఐదు లక్షల డేటాసెట్లు, 10 లక్షల అప్లికేషన్లను షేర్ చేసేందుకు ఈ వేదికను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!