

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై ఆసక్తికరమైన వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ వర్క్‌కు సంబంధించి పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని టాక్ వినిపిస్తోంది. ఫైనల్ అవుట్‌పుట్‌పై చిత్రబృందం సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సినిమా థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఓటీటీ డీల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే ప్రచారం వినిపిస్తోంది. ఓటీటీ వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్ తేదీపై మేకర్స్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలపైనే ఇండస్ట్రీ వర్గాల దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!