

జమ్మూకశ్మీర్‌లోని బద్గామ్ జిల్లా యూస్‌మార్గ్ ఎగువ ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది యాసిర్ హతమైనట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై అందిన కచ్చితమైన నిఘా సమాచారంతో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో యాసిర్ మృతి చెందాడు.
యాసిర్ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా సభ్యుడిగా పనిచేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అతడికి గతంలో లష్కరేకు చెందిన పలు ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. అతడి కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచిన బలగాలు ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. యాసిర్‌తో సంబంధమున్న ఇతర వ్యక్తులు, స్థానిక నెట్‌వర్క్‌లు, ఇటీవలి ఉగ్రవాద ఘటనల్లో అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!