

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం చేస్తున్న 11 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు ఎలాంటి సరైన వైద్య అర్హతలు లేకుండానే వివిధ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
నకిలీ వైద్యులు కొన్ని ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేరుతో సేవలు అందిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అర్హతలు లేకపోయినా వైద్యులుగా వ్యవహరిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ వైద్యులను నమ్మి చికిత్స పొందకుండా, వైద్యుల అర్హతలు, ఆస్పత్రి అనుమతులను నిర్ధారించుకున్న తర్వాతే వైద్యం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!