

కార్ల కొనుగోలుపై ఆసక్తి ఉన్న యువతను మరింతగా ఆకర్షించే లక్ష్యంతో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) తన కొత్త బ్రాండ్ గుర్తింపు ‘టాటా.కార్స్’ను ఆవిష్కరించింది. మరింత స్మార్ట్, పర్యావరణ హిత, అనుసంధానిత మొబిలిటీ అనుభవాలను అందించే దిశగా ఈ కొత్త బ్రాండ్ గుర్తింపును రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సులభంగా అర్థమయ్యేలా ‘టాటా.కార్స్’ పేరును ఎంపిక చేసినట్లు పేర్కొంది.
‘టాటా.కార్స్’ కేవలం కొత్త బ్రాండ్ గుర్తింపు మాత్రమే కాదని, సంస్థ ఊహిస్తున్న భవిష్యత్ మొబిలిటీపై తన సంకల్పాన్ని ప్రతిబింబించే ప్రకటన అని టీఎంపీవీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు. ఆధునిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికత, సుస్థిరత, కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇస్తూ తమ బ్రాండ్‌ను కొత్త దిశగా తీసుకెళ్లనున్నట్లు ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!