
సినిమాలు

ఆంత్రోపిక్ మరియు ఓపెన్ ఏఐ సంస్థలు ఎంటర్‌ప్రైజ్ ఏఐ సేవల రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యాపార సంస్థలకు ప్రత్యేక ఏఐ సేవలు అందించేందుకు ఆంత్రోపిక్ కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో బ్లాక్‌స్టోన్, గోల్డ్‌మన్ శాక్స్ సహా పలు పెద్ద పెట్టుబడిదారులు భాగస్వామ్యం అయ్యారు. మొత్తం సుమారు $1.5 బిలియన్ ఫండ్‌తో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది.
అదే సమయంలో ఓపెన్ ఏఐ కూడా “ది డిప్లాయ్‌మెంట్ కంపెనీ” అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది సుమారు $10 బిలియన్ విలువతో ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందించడమే ఈ కొత్త ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!