

నోకియా బ్రాండ్ ఫోన్ల తయారీతో గుర్తింపు పొందిన హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ త్వరలో HMD 2320 Flip 4G పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. గతంలో విడుదలైన నోకియా 2360 ఫ్లిప్ మోడల్‌ను పోలిన డిజైన్‌తో ఈ ఫోన్ రానున్నప్పటికీ, మెరుగైన 4G నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించనుంది. ప్రధానంగా బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ ఫోన్‌లో ఫ్లిప్ డిజైన్‌తో పాటు రెండు స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ ఫోన్‌లో 2.4 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, వెలుపల 1.77 అంగుళాల సెకండరీ స్క్రీన్ ఉండనున్నాయి. యూనిసోక్ T127 ప్రాసెసర్‌తో పనిచేసే ఇందులో 1,450mAh బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్, ఫొటోల కోసం 0.3MP కెమెరా, బ్లూటూత్ 5.0, వై-ఫై కనెక్టివిటీతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే SOS సపోర్ట్ కూడా ఉండనున్నాయి. సాధారణ ఫీచర్లతో పాటు ఆధునిక కనెక్టివిటీ కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్ ఉపయోగపడేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఫోన్ విడుదల తేదీ, ధరకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!