

ఓపెన్‌ఏఐ భారత్‌లో 13 నుంచి 17 ఏళ్ల టీనేజర్ల కోసం ChatGPT for Teensను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వయసుకు తగిన అనుభవాన్ని అందించడంతో పాటు సేఫ్టీ, పేరెంటల్ పర్యవేక్షణ, విద్యాపరమైన వినియోగానికి ఇందులో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఓపెన్‌ఏఐ ఇండియా హెడ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ అఫైర్స్ ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ.. టీనేజర్లు ఇప్పటికే ఏఐని విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సురక్షితమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు.
ChatGPT for Teensలో Study Mode కీలక ఫీచర్‌గా ఉంది. ఇది విద్యార్థులకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతూ, దశలవారీగా అర్థమయ్యేలా నేర్పిస్తుంది. క్విజ్‌లు, లెర్నింగ్ విజువలైజేషన్స్, హోంవర్క్ రిమైండర్లు, Study Hours వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సెల్ఫ్-హార్మ్, హింస, ఈటింగ్ డిజార్డర్స్, ప్రమాదకర కార్యకలాపాలు, లైంగిక కంటెంట్ వంటి హై-రిస్క్ అంశాలపై అదనపు రక్షణలు కల్పించారు. పేరెంట్లు తమ అకౌంట్లను టీనేజర్ల అకౌంట్లతో లింక్ చేసి కొన్ని సెట్టింగ్స్‌ను నిర్వహించడంతో పాటు Quiet Hours సెట్ చేయవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!