

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ తన VF5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త మోడల్ డిజైన్‌ను భారత పేటెంట్ కార్యాలయంలో సంస్థ నమోదు చేసినట్లు సమాచారం. పాత మోడల్‌తో పోలిస్తే దీని బయటి రూపంలో పలు మార్పులు చేశారు. కొత్త ఫ్రంట్ డిజైన్, క్లోజ్డ్ గ్రిల్, బంపర్‌పై అమర్చిన హెడ్‌ల్యాంప్స్, నిలువుగా ఉండే ఎయిర్ ఇన్‌టేక్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. క్రోమ్ అలంకరణలు, బాడీ క్లాడింగ్, బ్లాక్ కలర్ పిల్లర్లు, 17 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో పాటు వెనుకవైపు కలిపి ఉండే టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా ఉన్నాయి.
కారు లోపలి భాగంలోనూ మార్పులు చేశారు. పాత 8 అంగుళాల స్క్రీన్ స్థానంలో 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అందించారు. వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ టోన్ లెథరెట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, ఎన్‌ఎఫ్‌సీ కీ కార్డ్, స్మార్ట్‌ఫోన్ డిజిటల్ కీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ 37.23 kWh, 43 kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. పెద్ద బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్‌ఈడీసీ ప్రమాణాల ప్రకారం 370 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. 6.6 kW ఏసీ, 60 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 96.5 బీహెచ్‌పీ పవర్, 180 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భారత్‌లో విడుదల తేదీ, ధరను విన్ఫాస్ట్ ఇంకా ప్రకటించలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!