
జనరల్

ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 టూల్‌ను భారతీయులు భారీగా ఉపయోగిస్తున్నారు. ఈ సరికొత్త ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా చిత్రాలు రూపొందించబడ్డాయని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. ఆయన ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాల వినియోగం గణనీయంగా పెరిగింది. యానిమేటెడ్ పోర్ట్రెయిట్స్, అవతార్లు, ప్రొఫైల్ ఎడిట్స్ వంటి వాటికి ఈ టూల్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మెరుగైన ఎడిటింగ్, స్పష్టమైన అవుట్‌పుట్, భాషా మద్దతు వంటి ఫీచర్లు ఈ టూల్‌ను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!