

సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరాండికర్ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొత్త ఎగుమతి నియంత్రణ నిర్ణయాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఆంథ్రోపిక్ సంస్థ తన ఆధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను ఇతర దేశాల వినియోగదారులకు నిలిపివేసింది.
ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన “ఫేబుల్ 5”, “మైథోస్ 5” ఏఐ మోడళ్లను అమెరికా వెలుపల ఉన్న సంస్థలు, వ్యక్తులు వినియోగించకుండా ట్రంప్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిమితులు విధించినట్లు సమాచారం. ఇటీవలే ఫేబుల్ మోడల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరందికర్ మాట్లాడుతూ స్థానిక ఏఐ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ రంగంలో భారత్ ఇంకా వెనుకబడి ఉండొచ్చని అన్నారు. అయితే ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో ఏఐ వినియోగాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని తెలిపారు. పౌర సేవల్లో ఏఐ అమలుకు నీతి ఆయోగ్ కృషి చేస్తున్నదని, ఫౌండేషన్ ఏఐ మోడళ్ల అభివృద్ధికి 12 స్టార్టప్‌లకు మద్దతు అందిస్తున్నట్లు చెప్పారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!