

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనతో బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, ఆగస్టు 7న విడుదలైన తర్వాత హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. సక్సెస్ ప్రెస్ మీట్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, “ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం ఎంతో ఆనందంగా ఉంది. మేము ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు” అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. సత్య కామెడీ, సినిమా ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అన్నారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ఈ సినిమా తనకు కావాల్సిన హిట్ అని చెప్పారు. వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్ట్‌కు బ్యాక్‌బోన్‌లా నిలిచారని, సత్యతో ఆయన కాంబినేషన్ హిలేరియస్‌గా వర్కౌట్ అయిందని తెలిపారు. హీరోయిన్ రితిక నాయక్ కూడా ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసింది. నిర్మాతలు శిరీష్, రాజీవ్ రెడ్డి ఈ సినిమాతో మళ్లీ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా విజయంతో టీమ్ మొత్తం ఆనందంలో మునిగిపోయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!