
టెక్నాలజీ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెంగల్‌పట్టు జిల్లా కోర్టు విచారణకు హాజరైన ఆమె, కేసును కొనసాగించకపోవడానికి గల కారణాలను న్యాయస్థానానికి వివరించారు.
సంగీత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసును ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరిలో విజయ్‌పై పలు ఆరోపణలు చేస్తూ సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇరువురు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో పలుమార్లు విచారణ వాయిదా పడగా, అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగింది. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!