

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ గ్రూప్ చాట్‌ల కోసం పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రూప్‌లో క్రియేట్ చేసే పోల్స్‌కు ముగింపు సమయాన్ని ముందుగానే సెట్ చేయవచ్చు. నిర్ణయించిన సమయం పూర్తికాగానే పోలింగ్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. పోల్‌లో ఎవరు ఓటు వేశారనే వివరాలను ఇతర సభ్యులకు కనిపించకుండా ఉంచే అవకాశం కూడా కల్పించింది. అలాగే పోల్ సృష్టించిన తర్వాత 15 నిమిషాల లోపు ఎడిట్ చేసే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది.
అదనంగా, గ్రూప్ అడ్మిన్ల కోసం @all అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకేసారి గ్రూప్ సభ్యులందరికీ నోటిఫికేషన్ పంపవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ 32 మందికి పైగా సభ్యులు ఉన్న గ్రూప్‌లకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న గ్రూప్‌లోని ఎంపిక చేసిన సభ్యులతో సింగిల్ ట్యాప్‌లో కొత్త గ్రూప్ సృష్టించే అవకాశం కూడా కల్పించింది. పుట్టినరోజులు, ప్రత్యేక కార్యక్రమాలు లేదా చిన్న టీమ్ చర్చల కోసం ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!