

గూగుల్ తమ కొత్త ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్ గూగుల్‌బుక్‌ను Android Show: I/O Edition 2026లో పరిచయం చేసింది. జెమినై ఏఐ సామర్థ్యాలతో రూపొందించిన ఈ సరికొత్త ల్యాప్‌టాప్ ఆండ్రాయిడ్ యాప్స్‌కు ఆటోమేటిక్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే క్రోమ్ ఓఎస్ అనుభవాన్ని కూడా అందించనుంది. ఈ పరికరంలో ఉపయోగించిన ఆపరేటింగ్ సిస్టమ్‌పై గూగుల్ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఏఐ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా అధునాతన ఓఎస్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇది యాపిల్ మ్యాక్‌బుక్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
గూగుల్బుక్లో మ్యాజిక్ పాయింటర్, క్రియేట్ యువర్ విడ్జెట్ వంటి వినూత్న ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ డీప్‌మైండ్ రూపొందించిన మ్యాజిక్ పాయింటర్ ఏఐ ఆధారిత కర్సర్గా పనిచేస్తూ, కర్సర్ స్థానాన్ని బట్టి వెంటనే సూచనలు అందిస్తుంది. చిన్న ప్రాంప్ట్ ఇచ్చి వినియోగదారులు సొంత విడ్జెట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఫోన్లోని ఫైళ్లను నేరుగా యాక్సెస్ చేసే ఫీచర్‌తో పాటు ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరచే సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. 2011లో క్రోమ్‌బుక్‌ను ఆవిష్కరించిన 15 ఏళ్ల తర్వాత గూగుల్ ఈ గూగుల్‌బుక్‌ను తీసుకువచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!