
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్ నమోదైంది. బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (BKTC)కి చెందిన మాజీ అధికారి ప్రమోద్ నౌటియాల్ను పోలీసులు డెహ్రాడూన్‌లోని బీకేటీసీ చైర్మన్ నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం ఆయనను బద్రీనాథ్‌కు తరలించారు.
ఈ నెల 2వ తేదీన ఆలయ విరాళాల లెక్కింపులో భారీ అక్రమాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విరాళాల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!