
జనరల్

భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలో బ్రౌన్ అనే అమెరికా మాజీ సైనికుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. అతని గుర్తింపు, ప్రయాణ వివరాలు, సరిహద్దు దాటేందుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం బ్రౌన్ 2025లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి వచ్చాడు. అనంతరం గోవా, బెంగళూరు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత భారత్-నేపాల్ సరిహద్దుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అతని ప్రయాణాలపై భద్రతా సంస్థలు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!