

ఏఐ సాంకేతికతను వినియోగించే క్రమంలో సంస్థలు తమ మేధో సంపత్తి, అంతర్గత పరిజ్ఞానం, నిర్ణయ ప్రక్రియలను తెలియకుండానే ఏఐ సంస్థలకు అందిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. ఎక్స్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆయన దీనిని 'రివర్స్ ఇన్ఫర్మేషన్ ప్యారడాక్స్'గా పేర్కొన్నారు. ఏఐ సేవలకు డబ్బు చెల్లించడమే కాకుండా, వాటిని మెరుగ్గా పనిచేయించేందుకు తమ విలువైన సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తోందని వివరించారు.
సంస్థలు తమ డేటా, ఫీడ్‌బ్యాక్, ఈవాల్యుయేషన్ వ్యవస్థలు, సంస్థాగత పరిజ్ఞానంపై పూర్తి నియంత్రణ కొనసాగించాలని నాదెళ్ల సూచించారు. అలాగే సంస్థల పరిధిలోనే ప్రైవేట్ ఏఐ లెర్నింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, ఒకే ఏఐ మోడల్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవడం, స్వంత లెర్నింగ్ లూప్‌ను నిర్మించుకోవడం ద్వారా భవిష్యత్తులో పోటీ సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!