
జనరల్

కేదార్‌నాథ్ ఆలయ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. వీఐపీల వసతి, భోజనాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్లు ఆరోపణలు రావడంతో మాజీ మేనేజర్, ఇన్‌ఛార్జ్ అధికారి, మాజీ సీఈఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో మాజీ సీఈఓ ప్రమోద్ తనపై విధించిన సస్పెన్షన్‌తో పాటు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆలయ నిధుల వినియోగంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తుండగా, తదుపరి చర్యలు విచారణ ఫలితాల ఆధారంగా నిర్ణయించబడనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!