

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రవాస కవయిత్రి, రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 1న కోల్‌కతాకు రానున్నారు. రవీంద్ర సదన్‌లో నిర్వహించనున్న మత ఛాందసవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెకు సాహిత్య, సామాజిక సంస్థలు ఆహ్వానం అందించాయి. ఈ విషయాన్ని తస్లీమా నస్రీన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, "20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు" అని పేర్కొన్నారు.
2007లో తన రచనలపై చెలరేగిన నిరసనలు, భద్రతా సమస్యల నేపథ్యంలో తస్లీమా నస్రీన్ కోల్‌కతాను వీడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె తిరిగి నగరానికి రావాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. లౌకికవాదం, మహిళల హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు మద్దతుగా నిలిచిన ఆమె పర్యటన సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఆమె ఛాందసవాద వ్యతిరేక పోరాటానికి గుర్తింపుగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!