

భారతదేశం ఇటీవల ఆవిష్కరించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పాలనా మార్గదర్శకాలు దేశ సాంకేతిక నియంత్రణ విధానంలో కీలకమైన మార్పును సూచిస్తున్నాయి. తక్షణమే కఠినమైన చట్టాలను అమలు చేయకుండా, ప్రభుత్వం ‘ఇన్నోవేషన్-ఫస్ట్’ విధానాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుకూలమైన సవరణలు చేసి, ఏఐ వ్యవస్థలను సమర్థవంతంగా నియంత్రించాలనే నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ఏఐ చట్టాన్ని ప్రతిపాదించకుండా, ఏఐ వ్యవస్థలను నియంత్రించడంలో ఉన్న లోపాలను గుర్తించడానికి ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలను సమగ్రంగా సమీక్షించాలని సూచించింది. ఏఐ రంగంలో వేగంగా జరుగుతున్న ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
సవరణలు వీటిలోనే — ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (DPDP), 2023.
ఏఐ వ్యవస్థలు స్వయంగా డేటాను సవరించడం లేదా ఉత్పత్తి చేయడం వల్ల ప్రస్తుత ఇంటర్మీడియరీల (మధ్యవర్తుల) రక్షణ నిబంధనలకు సవాలు ఏర్పడుతున్నాయి. ఏఐ సృష్టించిన కంటెంట్‌కి ఎవరు బాధ్యత వహించాలి అన్న అంశంపై నియంత్రణపరమైన స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పైన పేర్కొన్న చట్టాల్లో అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా, ఈ సమస్యను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఒక సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏఐ గవర్నెన్స్ గ్రూప్ (ఏఐ పాలనను పర్యవేక్షించే ప్రధాన సంస్థ) మరియు టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ (TPEC – చట్టపరమైన లోపాలను గుర్తించడం, సవరణలను ప్రతిపాదించడం, అమలును పర్యవేక్షించడం) వంటి సంస్థలను ప్రభుత్వం ప్రతిపాదించింది.








.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!