
ఆరోగ్యం

మెటా ప్లాట్ఫార్మ్స్ సోషల్ మీడియా క్రియేటర్లకు షాక్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికలకు కొత్త చందా పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానంలో ప్రీమియం ఫీచర్లను ఉపయోగించేందుకు వినియోగదారులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉచితంగా లేదా పరిమితంగా అందుబాటులో ఉన్న కొన్ని సౌకర్యాలు ఇకపై చెల్లింపు ఆధారంగా మారనున్నాయి.
ప్రీమియం చందా తీసుకున్న వారికి ప్రత్యేకమైన ఫీచర్లు, మెరుగైన సాధనాలు అందించనున్నట్లు సమాచారం. దీనివల్ల వినియోగదారుల అనుభవం మెరుగుపడటంతో పాటు క్రియేటర్లకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఇన్స్టాగ్రామ్ ప్లస్, ఫేస్బుక్ ప్లస్ సేవల ధర సుమారు ₹387 వరకు ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విధానంతో మెటా తన ఆదాయ వనరులను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!