

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ తన తాజా ఫ్లాగ్షిప్ మోడల్ ‘క్లాడ్ ఓపస్ 4.8’ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రధానంగా నిజాయితీ, పారదర్శకత, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టినట్లు సంస్థ తెలిపింది. పెద్ద భాషా మోడళ్లలో సాధారణంగా కనిపించే అతివిశ్వాసపూరిత తప్పు సమాధానాలను తగ్గించే దిశగా ఈ వెర్షన్ అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. క్లాడ్ ఓపస్ 4.7కు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం ఆంత్రోపిక్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన పబ్లిక్ AI మోడల్‌గా నిలిచింది.
విడుదలకు ముందు నిర్వహించిన భద్రతా, అలైన్మెంట్ పరీక్షల్లో క్లాడ్ ఓపస్ 4.8 మెరుగైన ఫలితాలను నమోదు చేసినట్లు ఆంత్రోపిక్ వెల్లడించింది. మోసపూరిత ప్రవర్తన, దుర్వినియోగ సహకారం వంటి అంశాల్లో తగ్గుదల కనిపించగా, న్యాయ విశ్లేషణ, వ్యాపార అవసరాలు, ఏజెంటిక్ రీజనింగ్ వంటి విభాగాల్లో పనితీరు మెరుగుపడినట్లు తెలిపింది. ముఖ్యంగా తనకు తెలియని విషయాలను అంగీకరించడం, సమాధానాల్లోని లోపాలను గుర్తించడం వంటి లక్షణాలు ఈ మోడల్ ప్రత్యేకతలుగా పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!