

యాపిల్ సంస్థకు చెందిన పలు డిజిటల్ సేవల్లో ప్రస్తుతం అంతరాయం ఏర్పడినట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. యాపిల్ అకౌంట్స్, ఐక్లౌడ్, యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్ సేవలు ప్రభావితమయ్యాయి. దీంతో కొంతమంది వినియోగదారులు తమ అకౌంట్లలోకి సైన్ ఇన్ అవ్వలేకపోతున్నారు. అలాగే సంబంధిత సేవలను యాక్సెస్ చేయడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ అంతరాయం కారణంగా యాపిల్ పరికరాలు, ఆన్లైన్ సేవలపై ఆధారపడే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఐక్లౌడ్ ద్వారా డేటా యాక్సెస్ చేయడం, యాప్ స్టోర్ నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం, యాపిల్ మ్యూజిక్ వినియోగించడం వంటి సేవల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. యాపిల్ అకౌంట్లోకి లాగిన్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఈ సేవల అంతరాయానికి గల కారణాలు, సమస్యలను పూర్తిగా ఎప్పుడు పరిష్కరిస్తారనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!