
గాసిప్స్

అండర్ 19 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కొనసాగించారు.
లక్ష్య ఛేదనలో భారత్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా 18 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. విహాన్ మల్హోత్రా 61 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఆరోన్ జార్జి 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో భారత్ డిసెంబర్ 21 న దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత పొందింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!