

వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్‌ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. రూ.23,731 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా రూ.40,000 కోట్లకు పైగా విలువైన ఇంధన దిగుమతులను ఆదా చేయడంతో పాటు జీడీపీకి రూ.75,000 కోట్లకు పైగా అదనపు విలువను జోడించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే సుమారు 1.5 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, ఆహార వ్యర్థాలు వంటి సేంద్రీయ వ్యర్థాలను ప్రాసెస్ చేసి పునరుత్పాదక ఇంధన వనరులుగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 0.4 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లుగా ఉన్న సీబీజీ ఉత్పత్తిని 4 నుంచి 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు పెంచేందుకు ప్రాజెక్టులకు మూలధన సాయం అందించనున్నట్లు చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!