
జనరల్

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదో యూనిట్‌ను ఈ నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని జెన్‌కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బీహెచ్‌ఈఎల్ డైరెక్టర్ (పవర్) తజిందర్ గుప్తాతో కలిసి ఐదో యూనిట్‌లోని బూడిద నిర్వహణ, బొగ్గు నిర్వహణ, బాయిలర్, టర్బైన్ విభాగాలను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
యూనిట్-5 సమకాలీకరణ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదాద్రిలోని నాలుగు యూనిట్లను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడంతో పాటు ఐదో యూనిట్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!