
జనరల్

ఏషియన్ గేమ్స్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్‌లోని నిషిన్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత్ 124 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. అభిషేక్ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. శ్రీలంక తరఫున సహాన్ అరచ్చిగె మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, తుది పోరులో పాకిస్థాన్‌తో తలపడనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!