

ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో ఈ మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 2న నమీబియాలో మూడు జట్ల సూపర్ సిరీస్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. గ్రూప్ దశ అక్టోబర్ 7న ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో, అక్టోబర్ 14న అఫ్గానిస్థాన్‌తో, అక్టోబర్ 17న క్వాలిఫయర్ ఏ జట్టుతో, అక్టోబర్ 24న జింబాబ్వేతో భారత్ ఆడనుంది.

భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్ ఏ జట్టు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్-బీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ బీ జట్టు ఉన్నాయి. గ్రూప్ దశ తర్వాత సూపర్-7 దశ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. సెమీఫైనల్స్ నవంబర్ 17, 18 తేదీల్లో, ఫైనల్ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!