
జనరల్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల నిత్య కైంకర్యాలు, సమర్పణల ద్వారా ఆలయానికి రూ.20,40,855 ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి జె. భవానీశంకర్ తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్ కూడా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించి, స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను జస్టిస్ మహదేవన్‌కు అందజేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!