
జనరల్

ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ అనిల్ మొహద్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించి ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో తొలి రెండు సెట్లు 54-54, 56-56తో సమంగా ముగిశాయి.
మూడో సెట్‌లో భారత్ 55-52తో ఆధిక్యం సాధించగా, నాలుగో సెట్ 54-54తో డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 5-3తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు సెమీఫైనల్లో చైనాను భారత్ 5-1తో ఓడించి తొలిసారి మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌కు చేరింది. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 67కు చేరింది. ఇందులో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!