
జనరల్

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో అత్యంత చర్చనీయాంశమైన యువ ఆటగాళ్లలో ఒకరిగా మారాడు. మైదానంలో తన ఆటతీరుతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న ఈ టీనేజ్ క్రికెటర్‌కు ఇప్పుడు కమర్షియల్ రంగంలోనూ భారీ డిమాండ్ ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం.. బ్రాండ్ షూట్స్ కోసం వైభవ్ రోజుకు రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అతడి క్రేజ్ మరింత పెరిగితే ఈ ఫీజు రూ.3–4 కోట్ల వరకు చేరే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెమ్యూనరేషన్ వివరాలకు అధికారిక ధ్రువీకరణ లేదు. క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!