
జనరల్

టాప్ సీడ్ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్‌లో కష్టపడి ముందంజ వేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఇండోనేసియాకు చెందిన ముహ్ పుత్ర ఇర్వియాన్స్యా-బగస్ మౌలానా జోడీపై 21-19, 21-23, 21-10 తేడాతో విజయం సాధించింది.
64 నిమిషాలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ను సాత్విక్ జోడీ స్వల్ప తేడాతో గెలుచుకుంది. రెండో గేమ్‌లో ఇండోనేసియా జోడీ గట్టిగా పోరాడి మ్యాచ్‌ను సమం చేసింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్-చిరాగ్ జంట దూకుడుకు ప్రత్యర్థులు నిలువలేకపోయారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!