12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

Writer: Chandrika 10:54 AM, 12 ఆగస్టు, 2026
‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌ హవా కొనసాగుతోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో వన్డే క్రికెట్‌కు మాత్రం అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలకు లభించిన స్పందనే ఇందుకు నిదర్శనం. అయితే ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ అన్నారు. వన్డే క్రికెట్‌ ఇంకా సజీవంగా ఉందంటే అందుకు ప్రధాన కారణం అభిమానులేనని, వారి ఆదరణ లేకపోతే ఈ ఫార్మాట్‌ ఇప్పటికే కనుమరుగయ్యేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వన్డేలకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

టీ20 క్రికెట్‌ వచ్చిన సమయంలో దాని ప్రభావం టెస్టులపై తీవ్రంగా పడుతుందని చాలామంది భావించారని రోడ్స్‌ గుర్తుచేశారు. అయితే టెస్టులకు ఆదరణ తగ్గకపోగా.. కొన్ని మ్యాచ్‌లు దూకుడైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో టీ20 తరహా వినోదాన్ని అందిస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ క్యాలెండర్‌లో టీ20 లీగ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యం, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు తగ్గిపోవడం 50 ఓవర్ల ఫార్మాట్‌కు ప్రతికూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. టీ20లకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమే అయినా, వన్డేలను నిర్లక్ష్యం చేయకూడదని రోడ్స్‌ సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేలు లేని పరిస్థితిని ఊహించడం కష్టమని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

ట్యాగ్లు
జాంటీ రోడ్స్‌వన్డే క్రికెట్‌వన్డే ఫార్మాట్‌టీ20 క్రికెట్‌ఐసీసీ టోర్నీలుఅంతర్జాతీయ క్రికెట్‌క్రికెట్‌ వార్తలుద్వైపాక్షిక సిరీస్‌లువన్డే భవిష్యత్తుదక్షిణాఫ్రికా క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
జనరల్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు
జనరల్

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!