
టెక్నాలజీ

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా సారాంశ్ జైన్ భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సారాంశ్‌కు ఎట్టకేలకు టీమిండియాలో ఆడే అవకాశం దక్కింది.
33 ఏళ్ల 145 రోజుల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సారాంశ్ జైన్.. 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 2000లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో 32 ఏళ్ల 362 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. రవీంద్ర జడేజా చేతుల మీదుగా సారాంశ్ టెస్టు క్యాప్ అందుకున్నాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!